Chiranjeevi: 'మన శంకర వరప్రసాద్ గారు' ... వారం రోజుల వసూళ్లు ఒక రికార్డు అయితే... ఏడో రోజు వసూళ్లు మరో రికార్డు!
- వారం రోజుల్లో రూ.292 కోట్లు వసూలు చేసిన ప్రాంతీయ చిత్రం
- ఏడవ రోజు రూ.31 కోట్ల వసూళ్లు సాధించిన తెలుగు చిత్రం
- విదేశాలలోను అదరగొడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం విడుదలైన మొదటి వారంలోనే రూ.292 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఒక ప్రాంతీయ చిత్రంగా వారం రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచింది.
జనవరి 12న విడుదలైన ఈ సినిమా నిన్నటితో (18వ తేదీ) ఏడు రోజులు పూర్తి చేసుకుంది. ఏడవ రోజున ఈ చిత్రం రూ.31 కోట్లు వసూలు చేసింది. ఒక తెలుగు సినిమా ఏడవ రోజున ఇంతటి వసూళ్లు సాధించడం ఇదే తొలిసారి. రెండవ వారం ప్రారంభం రోజునే ఈ చిత్రం రూ.300 కోట్ల మార్కును దాటుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే, నేడు (సోమవారం) ఈ చిత్రం వసూళ్లు రూ.300 కోట్లు దాటే అవకాశం ఉంది.
విదేశాల్లో కూడా ఈ సినిమా భారీగా వసూళ్లు రాబడుతోంది. ఉత్తర అమెరికాలో ఇప్పటివరకు రూ.2.96 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. తద్వారా చిరంజీవి కెరీర్లో అక్కడ 3 మిలియన్ల డాలర్లు వసూలు చేసిన తొలి చిత్రంగా 'మన శంకర వరప్రసాద్ గారు' రికార్డు సృష్టించనుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో గత సంవత్సరం విడుదలైన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' రూ.200 కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో వరుసగా రెండు సంవత్సరాలలో రూ.200 కోట్ల క్లబ్లో చేరిన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా అనిల్ రావిపూడి నిలిచారు.