తిరుమలలో శర్వానంద్, సాక్షి వైద్య.. సినిమా సక్సెస్ కావడంతో మొక్కులు
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శర్వానంద్, సాక్షి వైద్య
- ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో దర్శనం
- ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా సక్సెస్ సందర్భంగా మొక్కులు
- స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందించిన టీటీడీ అధికారులు
శ్రీవారి దర్శనం పూర్తయిన తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు శర్వానంద్, సాక్షి వైద్యకు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం టీటీడీ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా శర్వానంద్ మీడియాతో మాట్లాడుతూ.. తాము కలిసి నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిందని, ఈ నేపథ్యంలోనే స్వామివారి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు వచ్చినట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీవారి దయతో భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాల్లో నటిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.