విజయ్ హజారే ట్రోఫీ... దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు
- రెండు సీజన్‌లలో 700కు పైగా పరుగులు చేసిన ఒకే ఒక్కడుగా రికార్డు
- 2020-21 సీజన్‌లో 7 మ్యాచ్‌లలో 700కు పైగా పరుగులు
- ప్రస్తుత సీజన్‌లో మరోసారి 721 పరుగులు చేసిన పడిక్కల్
అంతకుముందు 2020-21 సీజన్‌లో కూడా పడిక్కల్ 7 మ్యాచ్‌లలో 737 పరుగులు చేశాడు. టోర్నమెంట్‌లో ఒకే ఎడిషన్‌లో 700 పరుగుల మార్కును అధిగమించిన వారిలో మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, దేవదత్ పడిక్కల్, నారాయణ్ జగదీశన్, కరుణ్ నాయర్ ఉన్నారు. ఇప్పుడు పడిక్కల్ రెండో సీజన్‌లోను 700 పరుగులు చేయడం ద్వారా అరుదైన ఘనత సాధించాడు.
విజయ్ హజారే ట్రోఫీలో ఆయా సీజన్‌లలో అత్యధిక పరుగులు చేసిన వారిలో నారాయణ్ జగదీశన్ (2022-23 సీజన్) 830 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత పృథ్వీషా 827 (2021-22 సీజన్), కరుణ్ నాయర్ 779 (2024-25 సీజన్), దేవదత్ పడిక్కల్ 737, మయాంక్ అగర్వాల్ 723, దేవదత్ పడిక్కల్ ప్రస్తుత సీజన్‌లో 721 పరుగులతో కొనసాగుతున్నారు.