అస్సాంలో భూకంపం .. రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదు
- అస్సాం, త్రిపురల్లో ఈ రోజు తెల్లవారుజామున భూకంపం
- అస్సాంలోని మెరిగావ్ ప్రాంతంలో భూకంప తీవ్రత 5.1గా నమోదు
- త్రిపురలోని గోమతి ప్రాంతంలో తీవ్రత 3.9గా నమోదైందన్న ఎన్సీఎస్
అదే సమయంలో త్రిపురలో కూడా స్వల్ప భూకంపం సంభవించినట్లు ఎన్సీఎస్ ప్రకటించింది. గోమతి ప్రాంతంలో సుమారు 54 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడగా, రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.9గా నమోదైనట్లు పేర్కొంది. ఈ ప్రభావంతో మేఘాలయ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లు సమాచారం.
అయితే ఈ భూకంప ఘటనలతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.