Nicolas Maduro: దేశాధ్యక్షుడు మదురో, ఆయన భార్య ఎక్కడున్నారో తెలియడంలేదు: వెనెజులా ఉపాధ్యక్షురాలు
- అమెరికా దాడుల తర్వాత అధ్యక్షుడు మదురో ఆచూకీ లేకుండా పోయిన వైనం
- మదురో బతికే ఉన్నారో లేదో చెప్పాలని అమెరికాను డిమాండ్ చేసిన ఉపాధ్యక్షురాలు
- మదురో దంపతులను బంధించి దేశం దాటించామని ట్రంప్ ప్రకటన
- కారకాస్‌లో భారీ పేలుళ్లతో అమెరికా సైనిక ఆపరేషన్
- దేశాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చిన వెనెజులా ప్రభుత్వం
వెనెజులాలో తీవ్ర ఉద్రిక్తత, అనిశ్చితి నెలకొన్నాయి. దేశంలోని పలు ప్రాంతాలపై అమెరికా సైన్యం శనివారం తెల్లవారుజామున దాడులు జరిపిన అనంతరం, అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ ఆచూకీ తెలియడం లేదని ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ సంచలన ప్రకటన చేశారు. మదురో దంపతులు బతికే ఉన్నారో లేదో చెప్పాలని, వారిని తమకు చూపించాలని ఆమె అమెరికా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెనెజులానా డి టెలివిజన్‌కు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్థానిక పత్రిక 'ఎల్ నేషనల్' వెల్లడించింది. దేశాన్ని రక్షించుకోవడానికి ప్రజలు, సైన్యం కలిసికట్టుగా ముందుకు రావాలని రోడ్రిగ్జ్ పిలుపునిచ్చారు.
మరోవైపు, ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికా బలగాలు విజయవంతంగా పట్టుకున్నాయని, వారిని దేశం నుంచి తరలించామని తెలిపారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటించారు. అమెరికా చట్ట అమలు సంస్థల సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించామని, మరిన్ని వివరాలను మార్-ఎ-లాగోలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు జరిగే మీడియా సమావేశంలో వెల్లడిస్తానని చెప్పారు.
శనివారం తెల్లవారుజామున వెనెజులా రాజధాని కారకాస్‌తో పాటు మిరాండా, అరాగ్వా, లా గైరా ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. చినూక్ హెలికాప్టర్లు, ఇతర ప్రత్యేక దళాలతో అమెరికా సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఫాక్స్ న్యూస్ వర్గాలను ఉటంకిస్తూ 'ఎల్ నేషనల్' పేర్కొంది. అమెరికా సైన్యానికి చెందిన అత్యంత కీలకమైన 'డెల్టా ఫోర్స్' యూనిట్ ఈ దాడిలో పాల్గొని మదురోను బంధించినట్లు అమెరికన్ మీడియా కథనాలు ప్రసారం చేసింది.
గత కొన్ని నెలలుగా వెనెజులా తీరంలో అమెరికా తన సైనిక కార్యకలాపాలను పెంచిందని, మదురో పదవి నుంచి తప్పుకోవాలని వైట్‌హౌస్ తీవ్రంగా ఒత్తిడి చేస్తోందని స్థానిక మీడియా గుర్తుచేసింది. ఈ సైనిక దాడికి ట్రంప్ కొద్ది రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు కథనాలు వస్తున్నాయి.