Chandrababu Naidu: ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు

Chandrababu Naidu Wishes People on Vaikunta Ekadasi
షార్ట్స్‌లో చూడండి
వైకుంఠ ఏకాదశి పవిత్ర పర్వదినాన్ని తెలుగు ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పుణ్యాలు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయని ముఖ్యమంత్రి అన్నారు.

ఈ పవిత్ర పండుగ సందర్భంగా ప్రజలందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షల సందేశాన్ని పంచుకున్నారు. 
Go Back to Shorts
Chandrababu Naidu
AP CM
Vaikunta Ekadasi
Andhra Pradesh
Telugu People
Hindu Festival
Uttar Dwara Darshanam
Lord Vishnu

More Telugu News