Chandrababu Naidu: రేపు అయోధ్య వెళుతున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదే!

Chandrababu Naidu to Visit Ayodhya Tomorrow
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (డిసెంబర్ 28, ఆదివారం) అయోధ్యలో పర్యటించనున్నారు. శ్రీరామ జన్మభూమిలో కొలువుదీరిన బాలరాముడిని ఆయన దర్శించుకోనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసింది.

షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 11 గంటలకు అయోధ్య చేరుకుంటారు. అనంతరం నేరుగా శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌కు వెళతారు.

ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు, సుమారు మూడు గంటల పాటు ఆయన ఆలయ ప్రాంగణంలోనే గడపనున్నారు. ఈ సమయంలో శ్రీరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దర్శనం పూర్తయిన తర్వాత, మధ్యాహ్నం 3 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి ఆయన నేరుగా విజయవాడకు చేరుకుంటారు.  
Go Back to Shorts
Chandrababu Naidu
Ayodhya
Ram Mandir
Andhra Pradesh CM
Sri Rama Janmabhoomi
Ayodhya Visit
Bal Ram Darshan
Vijayawada

More Telugu News