భారత్ ముక్కలవ్వనంత వరకు మాకు శాంతిలేదు: బంగ్లాదేశ్ ఆర్మీ మాజీ జనరల్ సంచలన వ్యాఖ్యలు
- భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా
- ఏడాది కాలంగా భారత్‌పై బంగ్లా నాయకుల విమర్శలు
- భారత్ ముక్కలయ్యేంత వరకు బంగ్లాదేశ్‌లో శాంతి నెలకొనదని వ్యాఖ్య
ఆర్మీ మాజీ జనరల్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారత ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ విముక్తికి భారత్ చేసిన సహాయాన్ని మరిచి ఆ దేశ నాయకులు విషం చిమ్ముతున్నారని మండిపడుతున్నారు. తాత్కాలిక ప్రభుత్వంతో సంబంధాలు తిరిగి పునరుద్ధరించుకోవడానికి భారత్ ప్రయత్నిస్తున్న సమయంలో అమాన్ అజ్మీ చేసిన వ్యాఖ్యలు సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.