పల్నాడులో దారుణం.. ఇంట్లోకి చొరబడి యువకుడి హత్య... చికిత్స పొందుతూ తల్లి కూడా మృతి
- పల్నాడు జిల్లా ధూళిపాళ్లలో దారుణ హత్య
- ఇంట్లోకి చొరబడి కొడుకును నరికి చంపిన దుండగులు
- దాడిలో తల్లికి తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు
- పారిపోతున్న నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించిన గ్రామస్థులు
వివరాల్లోకి వెళితే, సాంబశివరావు, ఆయన తల్లి ఇంట్లో ఉన్న సమయంలో దుండగులు లోపలికి ప్రవేశించి వారిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో సాంబశివరావు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు.
అయితే, హత్య చేసి పారిపోతున్న నిందితులను సమీపంలోని చాగల్లు గ్రామస్థులు గమనించి, వారిని పట్టుకున్నారు. వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.