ఐ-బొమ్మ రవిపై ఐదు కేసులు.. మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
- రెండో కేసులో కోర్టులో హాజరుపరిచిన సైబర్ క్రైమ్ పోలీసులు
- మిగిలిన మూడు కేసులకు సంబంధించి పీటీ వారెంట్ దాఖలు
- కోర్టు అనుమతితో మిగిలిన మూడు కేసుల్లోనూ అరెస్టు చూపనున్న సైబర్ క్రైమ్ పోలీసులు
మిగిలిన మూడు కేసులకు సంబంధించి కూడా పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో ఆ మూడు కేసుల్లోనూ అరెస్టు చూపనున్నారు. రవిని పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఇదివరకే పోలీసులు రవిని ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది.