రేపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్.. కలెక్టర్లకు ఈసీ ఆదేశాలు
- నోటిఫికేషన్‌కు తెలంగాణ హైకోర్టులో తొలగిన అడ్డంకులు
- నామినేషన్లు, శాంతిభద్రతలపై ఈసీ సూచనలు
- ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలిపిన కలెక్టర్లు
ఏజీతో తెలంగాణ బీసీ మంత్రుల భేటీ
అడ్వోకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో తెలంగాణ బీసీ మంత్రులు సమావేశమయ్యారు. బీసీ రిజర్వేషన్లపై రేపు తుది విచారణ ఉన్న నేపథ్యంలో హైకోర్టులో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటుందని మంత్రులు ధీమా వ్యక్తం చేశారు. నేడు హైకోర్టులో జరిగిన వాదనలపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించారంటూ న్యాయవాదులను అభినందించారు.