సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో.... తిరుపతి ఎస్వీ వ్యవసాయ కళాశాలకు బాంబు బెదిరింపు
- రేపు తిరుపతి వస్తున్న సీఎం చంద్రబాబు
- ఎస్వీ అగ్రి కాలేజి వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు
- హెలిప్యాడ్ వద్ద 5 బాంబులు అమర్చినట్టు ఈమెయిల్ బెదిరింపు
- అప్రమత్తమైన పోలీసులు... విస్తృతంగా తనిఖీలు చేసిన బాంబు స్క్వాడ్
ఓ కుటుంబ పరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు కుటుంబం స్వగ్రామం నారావారిపల్లె వస్తోంది. మంత్రి నారా లోకేశ్, నారా భువనేశ్వరి ఈ సాయంత్రం నారావారిపల్లె చేరుకోనుండగా... సీఎం చంద్రబాబు రేపు ప్రత్యేక హెలికాప్టర్ లో తిరుపతి వస్తున్నారు. ఆయన రాక కోసం ఎస్వీ అగ్రికల్చర్ కాలేజి వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేపుతోంది.