2028లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తున్నాం: రామచందర్ రావు
- కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ఓట్లు అడిగే అర్హత లేదన్న రామచందర్ రావు
- స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని వెల్లడి
- ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శ
ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రూ. 40 వేల కోట్ల విలువైన ఎరువులను రాయితీపై అందిస్తోందని ఆయన గుర్తు చేశారు. ఎరువుల కొరతను అడ్డుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిందను కేంద్రంపై నెట్టడం సరికాదని ఆయన అన్నారు. బీసీ రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు.