తెలంగాణలో పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు
- శుక్ర, శనివారాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడి
- మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ
- గాలులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడి
ఈ రోజు ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. శనివారం నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.