Mahesh Kumar Goud: రేవంత్ రెడ్డిని కలిసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
- టీపీసీసీ చీఫ్‌గా ఏడాది పూర్తి చేసుకున్న మహేశ్ కుమార్ గౌడ్
- మహేశ్ కుమార్ గౌడ్‌ను అభినందించిన రేవంత్ రెడ్డి
- మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం కావాలన్న వీహెచ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్‌ను రేవంత్ రెడ్డి అభినందించారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఏడాది పూర్తి చేసుకున్న మహేశ్ కుమార్ గౌడ్‌కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు అభినందనలు తెలిపారు. మున్ముందు ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఇందుకోసం తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడిన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.