బిగ్ బాస్ సీజన్-9 ప్రోమో... కొత్త కాన్సెప్ట్ ప్రకటించిన నాగార్జున
- నాగార్జున వ్యాఖ్యాతగా బిగ్‌బాస్ సీజన్ 9కి రంగం సిద్ధం
- 'డబుల్ హౌస్.. డబుల్ డోస్' ట్యాగ్‌లైన్‌తో సరికొత్త ఫార్మాట్
- పూర్తిగా మారిన నిబంధనలతో షో ఉంటుందని హింట్ ఇచ్చిన నాగ్
- విడుదలైన ప్రచార చిత్రంతో అంచనాలు రెట్టింపు
- ఈసారి సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం
- త్వరలోనే ప్రసారం కానున్న రియాల్టీ షో
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఈసారి షో ఎంత భిన్నంగా ఉండబోతోందో నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ ప్రోమోలో నాగార్జున, ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిశోర్‌తో మాట్లాడుతూ.. ‘ఎప్పుడైనా పాత సిలబస్‌తో కొత్త ఎగ్జామ్ రాస్తావా?’ అని ప్రశ్నించడం ద్వారా కొత్తదనాన్ని నొక్కిచెప్పారు.
ఈ సీజన్‌లో ‘డబుల్ హౌస్’ అనే వినూత్నమైన కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు, కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాకుండా సామాన్యులకు కూడా ఈ షోలో అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. ఈ మార్పులతో షో మరింత ఉత్కంఠభరితంగా సాగనుందని, ప్రేక్షకులకు రెట్టింపు వినోదం గ్యారెంటీ అని బిగ్‌బాస్ బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. త్వరలోనే ఈ షో ప్రసార తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.