Donald Trump: ట్రంప్ కు నోబెల్ ఇవ్వాలంటూ ఐదు దేశాల డిమాండ్!

Donald Trump Deserves Nobel Peace Prize Five Nations Support
  • రోజుకో దేశం నుంచి ట్రంప్ కు శాంతి బహుమతి ప్రతిపాదన
  • పాకిస్థాన్, కాంబోడియా, ఆర్మేనియా, అజర్ బైజాన్, ఇజ్రాయెల్
  • ఆరు నెలల్లోనే అమెరికా అధ్యక్షుడు అద్భుతాలు చేశాడంటున్న నేతలు
నోబెల్ శాంతి బహుమతి అందుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. అధ్యక్షుడిగా పాలనా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోనే ట్రంప్ అద్భుతాలు చేశారని పలు దేశాధినేతలు పేర్కొంటున్నారు. ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం ఇటీవల మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆరు నెలల కాలంలో దాదాపు నెలకు ఓ యుద్ధం చొప్పున ఆరు యుద్ధాలను ట్రంప్ నివారించారని, ప్రపంచ శాంతి కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొంది.

తాజాగా ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ అజర్ బైజాన్, ఆర్మేనియా దేశాధినేతలు ప్రతిపాదించారు. దీంతో ట్రంప్ కు మద్దతు తెలుపుతున్న దేశాల సంఖ్య ప్రస్తుతం ఐదుకు చేరింది. పాకిస్థాన్, ఇజ్రాయెల్ దేశాలు చాలా రోజుల క్రితమే ట్రంప్ కు నోబెల్ ఇవ్వాలని ప్రతిపాదించాయి. రెండు రోజుల క్రితం కాంబోడియా కూడా ఇదే విధమైన ప్రకటన చేసింది.

ట్రంప్ నివారించిన యుద్ధాలు ఇవేనట..
  • థాయ్ లాండ్– కాంబోడియా
  • అజర్ బైజాన్– ఆర్మేనియా
  • ఇండియా– పాకిస్థాన్
  • ఇజ్రాయెల్– ఇరాన్
  • రువాండా– కాంగో
  • సెర్బియా– కొసావో
  • ఈజిప్ట్– ఇథియోపియా
Donald Trump
Nobel Peace Prize
Trump Nobel
Azerbaijan
Armenia
Pakistan
Israel
Cambodia
World Peace
International Relations

More Telugu News