ముగిసిన భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన.. 2026 టీ20 ప్రపంచకప్ వరకు షెడ్యూల్ ఇదే!
- ఇంగ్లండ్ పర్యటనను డ్రాతో ముగించిన భారత జట్టు
- 2026 టీ20 ప్రపంచకప్ వరకు బిజీ షెడ్యూల్
- బంగ్లాదేశ్ పర్యటన వాయిదాతో ఆగస్టులో మ్యాచ్‌లు నిల్
బంగ్లాదేశ్ పర్యటన వాయిదా పడటంతో భారత జట్టుకు ఆగస్టులో ఎలాంటి మ్యాచ్‌లు లేవు. కానీ సెప్టెంబర్‌లో యూఏఈలో జరిగే 2025 ఆసియా కప్‌తో తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది. ఈ టోర్నమెంట్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.
టెస్ట్ క్రికెట్‌లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో స్వదేశంలో రెండు టెస్ట్ సిరీస్‌లు ఆడుతుంది. ఈ రెండు సిరీస్‌ల మధ్య, ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లలో పాల్గొంటుంది.
వైట్ బాల్ ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తో స్వదేశంలో సిరీస్‌లు ఆడనుంది. ఆ తర్వాత జట్టు దృష్టి మొత్తం 2026 టీ20 వరల్డ్ కప్ పైనే ఉంటుంది.
2026 T20 వరల్డ్ కప్ వరకు పూర్తి షెడ్యూల్
| ఈవెంట్ | తేదీ | మ్యాచ్‌లు | ఆతిథ్య దేశం |
| ఆసియా కప్ | సెప్టెంబర్ 9-28 | 3-7 టీ20ఐలు | యూఏఐ |
| ఇండియా-వెస్టిండీస్ | అక్టోబర్ 2-14 | 2 టెస్ట్‌లు | భారతదేశం |
| ఇండియా-ఆస్ట్రేలియా | అక్టోబర్ 19-నవంబర్ 8 | 3 వన్డేలు/ 5టీ20లు | ఆస్ట్రేలియా |
| ఇండియా-దక్షిణాఫ్రికా | నవంబర్ 14-డిసెంబర్19 | 2 టెస్టులు/ 3 వన్డేలు/ 5 టీ20లు | భారతదేశం |
| ఇండియా-న్యూజిలాండ్ | జనవరి 11-31 | 3 వన్డేలు/5 టీ20లు | భారతదేశం |
| టీ20 ప్రపంచకప్ 2026 | ఫిబ్రవరి-మార్చి | 4-9 టీ20లు | ఇండియా/శ్రీలంక |
మొత్తంగా 2026 ఐపీఎల్ వరకు భారత జట్టు దాదాపు 22-31 టీ20లు ఆడుతుంది. ఇందులో వరల్డ్ కప్‌కు ముందు 18-22 మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ ఏడాది చివరి వరకు 4 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. జనవరి చివరి వరకు షెడ్యూల్ చేసిన 9 వన్డేలలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లు పాల్గొంటారు.