గడ్కరీ ఇంటికి బాంబు బెదిరింపు... గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు!
- నాగ్‌పూర్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు
- ఫోన్ కాల్‌తో పోలీసులు అప్రమత్తం
- బాంబ్ స్క్వాడ్ తనిఖీలు.. నకిలీ కాల్‌గా నిర్ధారణ
- కాల్ చేసింది మద్యం షాపులో పనిచేసే వ్యక్తిగా గుర్తింపు
హుటాహుటిన గడ్కరీ నివాసానికి చేరుకున్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇంటి ఆవరణతో పాటు లోపల కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి అంగుళాన్ని జల్లెడ పట్టినా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది కేవలం ఓ ఆకతాయి చేసిన నకిలీ కాల్ అని నిర్ధారణకు వచ్చారు.
మరోవైపు, ఈ బెదిరింపు కాల్‌ను పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన క్రైమ్ బ్రాంచ్ బృందాలు కొద్ది వ్యవధిలోనే నిందితుడి ఆచూకీని కనుగొన్నాయి. నాగ్‌పూర్‌లోని తులసి బాగ్ రోడ్డులో ఉన్న ఓ మద్యం దుకాణంలో పనిచేస్తున్న ఉమేష్ విష్ణు రౌత్‌గా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడు ఎందుకు ఈ బెదిరింపు కాల్ చేశాడనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.