దేశంలో పనికిమాలిన వాళ్లు ఎక్కువైపోయారు.. రకుల్ ప్రీత్ సింగ్
- సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లపై మండిపడ్డ నటి
- పనీపాట లేక సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఫైర్
- కొంతమందికి ఇతరులను బాధపెట్టడమే పని అంటూ విమర్శ
ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది రకుల్ కు మద్దతుగా కామెంట్లు పెడుతుండగా మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. కాగా, టాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన రకుల్ ప్రీత్ సింగ్ వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. ఇటీవల రకుల్ నటించిన ‘మేరే హస్సెండ్ కి బివి’ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా రకుల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటోంది. తనను ట్రోల్ చేస్తున్న వారికి కౌంటర్లు ఇస్తూ బిజీబిజీగా గడుపుతోంది.