భారీ వర్షాలు... అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
- ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- ఢిల్లీ నుంచి సీఎంవో అధికారులతో సమీక్ష
- ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని, నీటి ఉద్ధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు సాయం చేయడానికి అధికారులు జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు.