Rushikesh: సంగారెడ్డి వోక్సెన్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య

Student Rushikesh Suicide at Sangareddy Voksen University
  • బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న రుషికేశ్ ఆత్మహత్య
  • క్యాంపస్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్న రుషికేశ్
  • ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న విద్యార్థి 
సంగారెడ్డి జిల్లాలోని వోక్సెన్ విశ్వవిద్యాలయంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల రుషికేశ్ అనే విద్యార్థి క్యాంపస్‌లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు అతడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.

విశ్వవిద్యాలయ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, విద్యార్థి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రుషికేశ్ స్వస్థలం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సెల్ఫీ వీడియోను పరిశీలించిన అనంతరం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Rushikesh
Voksen University
Sangareddy
Student Suicide
Hyderabad
Telangana

More Telugu News