ఏపీలో 5 నగరాలకు కేంద్రం 'స్వచ్ఛ సర్వేక్షణ్' అవార్డులు... విశాఖకు 'మినిస్టీరియల్' అవార్డు
- ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటించిన కేంద్రం
- విశాఖ, గుంటూరు, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి నగరాలకు అవార్డులు
- పరిశుభ్రత అంశంలో అవార్డులు
స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా నిర్వహించే ఈ సర్వేలో పట్టణాల్లోని పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పౌరుల సహకారం, స్థిరమైన పరిష్కారాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. విశాఖపట్నం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నగరాల పౌరులను, స్థానిక సంస్థలను అభినందించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రాష్ట్రంలో పరిశుభ్రతపై అవగాహనను మరింత పెంచేందుకు దోహదపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.