Shhyamali: సమంత-రాజ్ ఫొటోల దుమారం.. దర్శకుడి భార్య ఆసక్తికర పోస్ట్

Samantha Raj Photos Spark Controversy Directors Wifes Cryptic Post
  • దర్శకుడు రాజ్‌తో సమంత వెకేషన్ ఫొటోల షేర్
  • వెంటనే స్పందించిన రాజ్ భార్య శ్యామాలి
  • ‘ఇతరులను బాధించవద్దు’ అంటూ ఇన్‍స్టాలో పోస్ట్
  • ఆమె బాధపడే ఈ పోస్ట్ పెట్టిందంటున్న నెటిజన్లు
  • గతంలోనూ నమ్మకం, కర్మ సిద్ధాంతంపై శ్యామాలి పోస్టులు
"ఏ మతమైనా చెప్పేది ఒక్కటే.. మన పనులతో ఇతరులను గాయపరచవద్దు. ఇదే జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమం" ఇదీ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు అర్ధాంగి శ్యామాలి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్న తాత్విక సందేశం. నటి సమంత తన భర్త రాజ్‌తో కలిసి ఉన్న వెకేషన్ ఫొటోలను షేర్ చేసిన కొద్దిసేపటికే శ్యామాలి ఈ పోస్ట్ పెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కొంతకాలంగా సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ, మంగళవారం సాయంత్రం రాజ్‌తో కలిసి దిగిన ఫొటోలను సమంత తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోలు వైరల్ అయిన కాసేపటికే శ్యామాలి నుంచి ఈ తాత్విక స్పందన రావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భర్త ఫొటోల వల్లే ఆమె ఆవేదన చెంది, పరోక్షంగా ఈ సందేశాన్ని పంచుకుని ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

శ్యామాలి ఇలాంటి పోస్టులు పెట్టడం ఇదే మొదటిసారి కాదు. సమంత-రాజ్‌పై వార్తలు మొదలైనప్పటి నుంచి ఆమె సోషల్ మీడియా పోస్టులపై నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. గతంలో "నమ్మకాన్ని ఒక్కసారి కోల్పోతే ఎంత ఖర్చు పెట్టినా తిరిగి పొందలేం" అని, "కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది" అని ఆమె పెట్టిన పోస్టులు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి.

రాజ్, డీకే దర్శకత్వం వహించిన ‘ది ఫ్యామిలీమ్యాన్ 2’, ‘సిటడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌లలో సమంత నటించారు. ఇటీవల ఆమె నిర్మించిన ‘శుభం’ చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించారు. వృత్తిపరమైన ఈ బంధం వ్యక్తిగత బంధంగా మారిందని వార్తలు వస్తున్నా, ఇప్పటివరకు సమంత గానీ, రాజ్ గానీ ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు.
Shhyamali
Samantha
Samantha Ruth Prabhu
Raj Nidimoru
Shyamali Nidimoru
The Family Man 2
Citadel Honey Bunny
dating rumors
Bollywood
controversy

More Telugu News