Arti: 19 ఏళ్ల కుర్రాడితో భార్యకు సంబంధం... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, ఇద్దరికీ పెళ్లి చేసిన భర్త

Bihar Husband Catches Wife With 19 Year Old Lover Forces Them To Marry
  • అర్ధరాత్రి ప్రియుడితో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
  • కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేసి, ఇద్దరినీ బంధించిన వైనం
  • భార్య నుదుటి సింధూరాన్ని చెరిపేసి ప్రియుడితో పెళ్లి చేసిన భర్త
భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అక్కడికక్కడే పెళ్లి జరిపించిన విచిత్ర ఘటన బీహార్‌లో వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. సహర్సా ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల ఆర్తికి వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. ఆమె తన భర్తతో కలిసి ఓ టీ స్టాల్ నిర్వహిస్తోంది. అదే టీ స్టాల్‌లో పనిచేస్తున్న 19 ఏళ్ల విశాల్ అనే యువకుడితో ఆర్తికి పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానంతో ఉన్న భర్త, ఓ రోజు అర్ధరాత్రి ఆమె విశాల్‌తో సన్నిహితంగా ఉండగా పట్టుకున్నాడు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త, తన కుటుంబ సభ్యుల సహాయంతో వారిద్దరినీ బంధించి దాడి చేశాడు. అనంతరం, భార్య నుదుటిపై ఉన్న సింధూరాన్ని చెరిపేసి, ఆమెకు ప్రియుడు విశాల్‌తో అక్కడికక్కడే వివాహం జరిపించాడు. ఈ ఘటనపై స్పందించిన భర్త, "భార్య చేతిలో హత్యకు గురికాకుండా బయటపడ్డాను, అదే చాలు. కానీ ఆమె నన్నే కాకుండా, ఇద్దరు పిల్లల జీవితాలను కూడా నాశనం చేసింది" అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. 
Arti
Bihar
Extramarital affair
Husband
Lover
Saharsa
Marriage
Cheating
Adultery

More Telugu News