అరుదైన రికార్డు సొంతం చేసుకున్న స్మృతి మంధాన
- స్మృతి మంధాన చారిత్రక రికార్డు
- మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్ గా స్మృతి
- ఇంగ్లాండ్‌తో టీ20లో 62 బంతుల్లో 112 పరుగులతో మెరుపు శతకం
- టీ20ల్లో ఇంగ్లాండ్‌పై భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు (210/5)
- ప్రపంచ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించిన ఎలైట్ జాబితాలో చోటు
ఇంగ్లాండ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. కెప్టెన్‌గా ముందుండి నడిపించిన స్మృతి మంధాన, ఇంగ్లాండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కేవలం 62 బంతుల్లో 15 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సహాయంతో 112 పరుగులు చేసి, విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. ఇది ఆమెకు అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో తొలి సెంచరీ కావడం గమనార్హం. ఈ శతకంతోనే ఆమె మూడు ఫార్మాట్లలో సెంచరీలు పూర్తి చేసిన ఏకైక భారత మహిళగా రికార్డులకెక్కింది.
మంధాన మెరుపు సెంచరీ కారణంగా భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లాండ్‌పై భారత మహిళల జట్టుకు ఇదే అత్యధిక స్కోరు.