కిషన్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరిన ఎమ్మెల్యే రాజాసింగ్
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యర్థన
- సమస్యలు వివరించేందుకు సమయం కేటాయించాలని విజ్ఞప్తి
- ఎక్కడ, ఎప్పుడు కలవాలో నిర్ణయిస్తే వస్తానన్న రాజాసింగ్
- తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం అవసరమని వ్యాఖ్య
- వ్యక్తిగత విభేదాలు వీడి ఐక్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు
ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టి, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందరూ సమష్టిగా పనిచేస్తేనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.