Rabindranath Tagore: బంగ్లాదేశ్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిపై దాడి
- దర్యాప్తుకు ఆదేశించిన అధికారులు
- ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిన పురావస్తు శాఖ
- మ్యూజియం వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన
బంగ్లాదేశ్‌లో నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిపై కొందరు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి సిరాజ్ గంజ్ జిల్లాలోని ఠాగూర్ పూర్వీకుల నివాసం (రవీంద్ర మెమోరియల్ మ్యూజియం) సందర్శనకు వచ్చారు. అయితే ఆ సమయంలో వాహనం పార్కింగ్ ఫీజు విషయంలో మ్యూజియం సిబ్బందితో వారికి గొడవ జరిగింది.
దీంతో వారు ఆ వ్యక్తిని నిర్బంధించి దాడి చేశారని తెలుస్తోంది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యూజియం వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే ఒక గుంపు మ్యూజియం ఆడిటోరియంపై దాడి చేసి ధ్వంసం చేసింది. సంస్థ డైరెక్టర్‌పై కూడా దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై దర్యాప్తుకు పురావస్తు శాఖ ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. అనివార్య కారణాల వల్ల మ్యూజియంకు సందర్శకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. కచహరిబాడీగా కూడా పిలువబడే ఠాగూర్ పూర్వీకుల ఇంటిని రెవెన్యూ కార్యాలయంగా ఉపయోగించారు. ఈ నివాసంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ అనేక రచనలు చేశారు.