దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు.. ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్
- గృహ కేటాయింపుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్
- కేంద్ర మంత్రి మనోహర్ లాల్ చారిత్రాత్మక నిర్ణయం
- సుగమ్య భారత్ అభియాన్‌లో భాగంగా ఈ చర్య
దివ్యాంగుల హక్కుల చట్టం, 2016 స్ఫూర్తికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నివాస గృహాలను దివ్యాంగులకు సముచితంగా అందుబాటులోకి తెచ్చేందుకు డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ ఒక అధికారిక మెమోరాండం జారీ చేసిందని పేర్కొంది.
"ప్రతి పౌరుడి సాధికారత పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకితభావానికి ఈ చొరవ నిదర్శనం. సమ్మిళిత మరియు అందరికీ అందుబాటులో ఉండే భారతదేశ నిర్మాణానికి ఇది మరింత బలాన్ని చేకూరుస్తుంది" అని ఆ ప్రకటనలో వివరించారు.