భారత్ ప్రతీకార దాడి ఎప్పుడు చేస్తుందంటే.. పాక్ మాజీ హైకమిషనర్ సంచలన ట్వీట్
--
అయితే, పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని పొట్టనపెట్టుకోవడంతో రష్యా పర్యటన ప్లాన్ ను రద్దు చేసుకున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ ను పంపించాలని భావించినా.. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన కూడా వెళ్లే అవకాశంలేదని తెలుస్తోంది. ఈ వేడుకలను పురస్కరించుకుని సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ.. ఉగ్రవాదంపై పోరులో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యాతో పాటు భారత్ లోనూ పాక్ రాయబారిగా పనిచేసిన అబ్దుల్ బాసిత్ సంచలన ట్వీట్ చేశారు. రష్యా విక్టరీ డే పరేడ్ తర్వాత.. అంటే ఈ నెల 10న కానీ, 11 న కానీ పాక్ పై భారత్ దాడి చేస్తుందని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.