సినిమా కోసం చేశా.. మీరు అనుకరించొద్దు ప్లీజ్: సూర్య

Suriya tells fans Please dont smoke
తన తదుపరి చిత్రం 'రెట్రో'లో కొన్ని సన్నివేశాల్లో ధూమపానం చేసినప్పటికీ, నిజ జీవితంలో ఆ అలవాటుకు దూరంగా ఉండాలని నటుడు సూర్య తన అభిమానులకు గట్టిగా సూచించారు. తిరువనంతపురంలోని లులూ మాల్‌లో జరిగిన 'రెట్రో' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

"ఒక చిన్న హెచ్చరిక. నేను కేవలం సినిమా అవసరం కోసమే సిగరెట్లు కాల్చాను. దయచేసి మీ నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి" అని సూర్య స్పష్టం చేశారు. పొగతాగడం ఒకసారి మొదలుపెడితే సులభంగా వదిలించుకోలేని వ్యసనంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. "ఒక్క పఫ్ లేదా ఒక్క సిగరెట్‌తో మొదలుపెడతారు. కానీ ప్రారంభించాక దాన్ని ఆపడం చాలా కష్టం. నేను దీన్ని కచ్చితంగా ప్రోత్సహించను, మీరు కూడా చేయకండి" అని ఆయన హితవు పలికారు.

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ 'రెట్రో' చిత్రం, తాను గతంలో చేసిన 45 సినిమాలకు భిన్నంగా ఉంటుందని సూర్య తెలిపారు. కార్తీక్‌తో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో సూర్యతో పాటు పూజా హెగ్డే, మలయాళ నటులు జోజు జార్జ్, జయరామ్ తదితరులు నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
Go Back to Shorts
Suriya
Retro Movie
Smoking
Anti-Smoking Campaign
Suriya's Warning
Kollywood Actor
Pooja Hegde
Karthik Subbaraj
Retro Movie Release
Tamil Cinema

More Telugu News