తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
- వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ శాఖ
- తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడి
- పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్న వాతావరణ శాఖ
పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అదే సమయంలో, రానున్న మూడు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించింది. రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.