తన క్రికెట్ టీమ్ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- సీబీఐటీ కాలేజీ క్రికెట్ టీమ్ ఫొటోను ఎక్స్ వేదికగా షేర్ చేసిన మంత్రి
- మేజర్ త్రో బ్యాక్ అంటూ ట్వీట్
- నిలబడిన వారిలో కుడివైపు చివరణ మంత్రి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సామాజిక మాధ్యమంలో పంచుకున్న ఈ ఫొటోలో 13 మంది క్రీడాకారులు ఉన్నారు. ఇందులో నిలబడిన వారిలో కుడివైపు చివరన మంత్రి ఉన్నారు. ఈ ఫొటోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మంత్రి చాలా బాగున్నారని, శివ సినిమాలో నాగార్జునలా కనిపిస్తున్నారని పలువురు వ్యాఖ్యానించారు.