చైనా అధ్యక్షుడితో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత భేటీ
- నాలుగు రోజుల చైనా పర్యటనకు వెళ్లిన మహమ్మద్ యూనస్
- ఈ ఉదయం జిన్ పింగ్ తో భేటీ
- చైనా, పాకిస్థాన్ లకు దగ్గరవుతున్న బంగ్లాదేశ్
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా యూనస్ చైనాకు వెళ్లారు. ఈ క్రమంలో ఈ ఉదయం జిన్ పింగ్, యూనస్ భేటీ అయ్యారు. బుధవారం హైనాన్ ప్రావిన్స్ లోని బోవో ఫోరమ్ ఫర్ ఆసియా వార్షిక సదస్సులో యూనస్ పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన బీజింగ్ కు చేరుకున్నారు. బీజింగ్ లో చైనా ప్రభుత్వ ప్రతినిధులతో యూనస్ భేటీ అయ్యారు. చైనా ఇస్తున్న రుణాలకు వడ్డీలు తగ్గించాలని, ఆ దేశ నిధులు అందుతున్న ప్రాజెక్టులకు కమిట్ మెంట్ ఫీజును మాఫీ చేయాలని వారిని కోరారు. ఈ ఉదయం చైనా అధినేతతో భేటీ అయ్యారు.