జైలు నుంచే వైసీపీ నేతలతో బోరుగడ్డ కాన్ఫరెన్స్ కాల్స్!
- చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌ను దూషించిన కేసులో బోరుగడ్డ అనిల్ అరెస్ట్
- రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ
- ఫేక్ సర్టిఫికెట్‌కు జైలులోనే బీజం పడినట్టు గుర్తింపు
జైలు నిబంధనల ప్రకారం రిమాండ్ ఖైదీలు వారానికి మూడుసార్లు ఫోన్‌లో మాట్లాడుకోవచ్చు. ఈ సందర్భంగా వాటిని రికార్డు చేస్తారు. అవి అనుమానాస్పదంగా ఉంటే అప్రమత్తం కావాలి. కానీ, ఈ విషయంలో జైలు అధికారులు ఇవేవీ పట్టించుకోలేదు. బోరుగడ్డ అనిల్ జైలు నుంచి ఒక నంబర్‌కు ఫోన్ చేసేవాడని, ఆయన వైసీపీ నేతలతో కాన్ఫరెన్స్ కలిపేవాడని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో అతడు ఎవరితో మాట్లాడేవాడు? ఏం మాట్లాడేవాడు? అన్నది తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.