తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు ఎప్పటి నుంచంటే..!
- ఎండలు ముదరడంతో ఒంటిపూట బడులు
- ఈ నెల 15 నుంచి ప్రారంభం.. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు
- ఏప్రిల్ 20 నుంచి వేసవి సెలవులు
అదేవిధంగా, రాష్ట్రంలోని స్కూళ్లకు వచ్చే నెల (ఏప్రిల్) 20 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాలు ఉన్న స్కూళ్లు మధ్యాహ్నం పూట క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. ఈమేరకు పాఠశాలల్లో ఏర్పాట్లు చేసుకోవాలంటూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది.