తెలుగు సినీ చరిత్రలో కృష్ణవేణిది ఓ ప్రత్యేక అధ్యాయం: బాలకృష్ణ
- నటి కృష్ణవేణి మృతి వ్యక్తిగతంగా తమకు తీరని లోటని వ్యాఖ్య
- ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడి
- కృష్ణవేణి కుటుంబానికి సానుభూతి తెలియజేసిన బాలకృష్ణ
ఇటీవల నిర్వహించిన ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలలో, అంతకుముందు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో కృష్ణవేణిని ఘనంగా సత్కరించామని గుర్తుచేశారు. కృష్ణవేణి మృతి వ్యక్తిగతంగా తమకు తీరని లోటు అని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా కృష్ణవేణి కుటుంబ సభ్యులకు నందమూరి బాలకృష్ణ సానుభూతి తెలిపారు.