రాబోయేది బీసీ రాజ్యమే: ఆర్. కృష్ణయ్య

R Krishnaiah talks about BC welfare
  • ప్రమోషన్లలో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల బీసీ ఉద్యోగులు నష్టపోతున్నారని వ్యాఖ్య
  • రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్
  • దేశంలో బీసీ ఉద్యమం బలంగా ఉందన్న ఆర్. కృష్ణయ్య
రాబోయేది బీసీ రాజ్యమేనని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. బీసీ లెక్చరర్లు, బీసీ మేధావులు బలమైన ఉద్యమాన్ని చేపట్టాలన్నారు. ఈరోజు కాచిగూడలో తెలంగాణ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ నూతన క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రమోషన్లలో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల బీసీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.

రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. దేశంలో బీసీ ఉద్యమం బలంగా ఉందన్నారు. ప్రస్తుతం గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ నినాదం నడుస్తోందని తెలిపారు. బీసీ ఉద్యమాన్ని రాజకీయ నాయకులు నడిపించవద్దని... బీసీ మేధావులే దీనిని ముందుకు నడిపించాలన్నారు. బీసీ మేధావులు మరింత బలమైన ఉద్యమంగా మార్చాలన్నారు.
Go Back to Shorts
R Krishnaiah
Telangana
Andhra Pradesh

More Telugu News