15 సార్లు రిజెక్ట్.. అయినా వదల్లేదు.. చివరకు అమెజాన్‌లో రూ.1.1 కోట్ల ప్యాకేజీ
- 15 సార్లు రిజెక్ట్ అయినా అమెజాన్‌ను వదలని గంతవ్య మాల్వియా
- చివరకు జర్మనీలోని అమెజాన్‌లో ఉద్యోగం
- ఏకంగా రూ.1.1 కోట్ల ప్యాకేజీ
- 2023 నుంచి ఏడబ్ల్యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
- ఇప్పుడు ట్యాక్స్‌ఫిక్స్‌లో కొత్త ఉద్యోగం
ఒక్కసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఏకంగా 15 సార్లు తిరస్కరణ ఎదురైంది. అయినా లక్ష్యాన్ని వదల్లేదు. అమెజాన్‌లో ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో మళ్లీ మళ్లీ దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. చివరకు జర్మనీలోని అమెజాన్‌లో ఉద్యోగం సాధించారు. రూ.1.1 కోట్ల ప్యాకేజీ అందుకున్నారు. మధ్యప్రదేశ్ భోపాల్‌కు చెందిన గంతవ్య మాల్వియా కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లక్ష్మీ నారాయణ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో గంతవ్య మాల్వియా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చదివారు. ఆయనది కంప్యూటర్ సైన్స్ నేపథ్యం కాదు. ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే సాఫ్ట్‌వేర్ రంగంపై దృష్టి పెట్టారు. ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, మెషీన్ లెర్నింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ నేర్చుకున్నారు. ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టుల ద్వారా అనుభవం సంపాదించారు.
అమెజాన్ కెరీర్ పేజీని క్రమం తప్పకుండా పరిశీలిస్తూ తనకు సరిపోయే ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న పోస్టులకూ అప్లై చేసేవారు. అయితే 15 సార్లు ఆయన అప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అయినా ప్రయత్నం ఆపలేదు.
చివరకు జర్మనీలోని అమెజాన్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఎంపిక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి ఉద్యోగం సాధించారు. లక్ష్మీ నారాయణ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ వివరాల ప్రకారం ఆయనకు రూ.1.10 కోట్ల ప్యాకేజీ లభించింది. 2023 ఆగస్టు నుంచి అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌గా పనిచేశారు.
ఇప్పుడు అమెజాన్‌కు కూడా గుడ్‌బై చెప్పారు. తాజాగా ట్యాక్స్‌ఫిక్స్‌లో చేరుతున్నట్లు ‘ఎక్స్’లో ప్రకటించారు. ‘‘కొత్త ఆరంభాలు’’ అంటూ పోస్ట్ చేశారు.
గంతవ్య కథ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. 15 తిరస్కరణల తర్వాత కూడా పట్టుదల కోల్పోకుండా చివరకు అమెజాన్ జర్మనీలో ఉద్యోగం సాధించడం స్ఫూర్తిదాయకమని పలువురు కామెంట్ చేశారు. ముఖ్యంగా నాన్-సీఎస్ నేపథ్యం ఉన్న ఇంజినీర్లకు ఆయన ప్రయాణం మంచి ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు.