తిరుపతి తొక్కిసలాట ఘటనపై స్పందించిన బాలకృష్ణ
- తిరుపతి ఘటన తనను ఎంతగానో కలిచివేసిందన్న బాలకృష్ణ
- తిరుపతి ఘటన చాలా బాధాకరమన్న బాలకృష్ణ
- డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ
బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన 'డాకు మహారాజ్' చిత్రం సంక్రాంతి సందర్భంగా ఎల్లుండి విడుదలవుతోంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ మొదట అనంతపురంలో నిర్వహించాలని భావించామని, తిరుపతి ఘటన నేపథ్యంలో అక్కడి ఈవెంట్‌ను రద్దు చేశామన్నారు. మృతుల కుటుంబాలకు చిత్ర బృందం తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు.