నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను: నారా లోకేశ్
- అచ్చం చంద్రబాబులా ఉన్న మిమిక్రీ ఆర్టిస్ట్
- ఒక పెళ్లి వేడుకలో అందరినీ ఆశ్చర్యపరిచిన వైనం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఇటీవల ఒక పెళ్లి వేడుకకు ఒక మిమిక్రీ ఆర్టిస్టు అచ్చం చంద్రబాబు వేషధారణలో వచ్చారు. వేదికపైకి వచ్చి అందరికీ విక్టరీ సింబల్ చూపించారు. చంద్రబాబు మాదిరే మాట్లాడుతూ అక్కడున్న అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.