లక్ష డాలర్లకు చేరిన బిట్ కాయిన్ వాల్యూ
- ట్రంప్ గెలవడంతో బిట్ కాయిన్ దూకుడు
- 4 వారాల్లోనే 45 శాతం పెరిగిన విలువ
- భవిష్యత్తులో 1.20 లక్షల డాలర్ల మార్క్ చేరుతుందని అంచనాలు
ప్రెసిడెంట్ ఎన్నికల సమయంలో బిట్ కాయిన్ ధర 69,374 డాలర్లుగా ఉంది. అంతకు రెండేళ్ల ముందు 17 వేల డాలర్లకు పడిపోయింది. అయితే, ట్రంప్ గెలవడం, ఎలాన్ మస్క్ కు తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో బిట్ కాయిన్ ర్యాలీ కొనసాగింది. దీంతో పాటు గతంలో ఎస్‌ఈసీ బాధ్యతలు నిర్వహించిన పాల్ అట్కిన్ కు ట్రంప్ మరోసారి అవే బాధ్యతలు అప్పగించడం సానుకూల ప్రభావం చూపింది. కొత్త ప్రభుత్వంలో క్రిప్టో అనుకూల పాలసీలు వస్తాయన్న అంచనాలు బలపడ్డాయి. దీంతో బిట్ కాయిన్ ధర రోజురోజుకూ పెరిగిపోతోందని మడ్ రెక్స్ సీఈవో పేర్కొన్నారు. భవిష్యత్తులో బిట్‌కాయిన్ 1,20,000 డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు.