ఈ నెల 29న ఐసీసీ సమావేశం... టీమిండియాపై నిర్ణయం తీసుకునే అవకాశం!
- పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ
- షెడ్యూల్, వేదికల ఖరారుపై చర్చించనున్న ఐసీసీ
- భారత్ పై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి వేదికగా పాకిస్థాన్ ను గతంలోనే ఎంపిక చేశారు. అయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్ వెళ్లేది లేదని భారత్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఈ నెల 29న జరిగే సమావేశంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.