పదో తరగతి విద్యార్థులు తెలుగులో కూడా పరీక్షలు రాసుకోవచ్చు.. అవకాశమిచ్చిన ఏపీ ప్రభుత్వం

పదో తరగతి విద్యార్థులు తెలుగులో కూడా పరీక్షలు రాసుకోవచ్చు.. అవకాశమిచ్చిన ఏపీ ప్రభుత్వం

AP Govt Agrees To Write 10th Exams In Telugu Medium To Govt School Students
  • 2020-21లో 1 నుంచి 6 తరగతులను ఒకేసారి ఇంగ్లిష్ మీడియంలోకి మార్చిన గత ప్రభుత్వం
  • ఆ తర్వాత ఒక్కో క్లాసును ఇంగ్లిష్‌లోకి మార్చిన వైనం
  • ఇంగ్లిష్ 
  • చాలా పాఠశాలల్లో రెండు మాధ్యమాల కొనసాగింపు
  • తెలుగులో చదివిన వారికి తెలుగులోనే పరీక్షలు రాసేలా అవకాశం ఇవ్వాలని కోరిన ఉపాధ్యాయులు
  • ఈ ఒక్క ఏడాదికి అవకాశమిచ్చిన ప్రభుత్వం
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారు కావాలనుకుంటే పబ్లిక్ పరీక్షలు తెలుగు మాధ్యంలోనే రాసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే సమర్పించిన దరఖాస్తుల్లో ఈ మేరకు సవరణలు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే, ఇది ఈ ఒక్క ఏడాదికే పరిమితం కానుంది. 

2020-21లో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 తరగతులను ఇంగ్లిష్ మాధ్యమంలోకి మార్చుతూ అప్పటి సర్కారు ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత ఒక్కో తరగతిని ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుతున్నట్టు ప్రకటిస్తూ పదో తరగతిలోకి వచ్చిన విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలోనే పరీక్షలు రాయాలనే నిబంధన విధించింది. అయితే, సుప్రీంకోర్టులో ఈ విషయమై కేసు దాఖలు ‘కావడంతో ‘ఇంగ్లిష్ మీడియం అని చెప్పకుండా ‘ఒకే మాధ్యమం’ ఉండాలని ఆదేశించింది. 

ఒకే మాధ్యమం అని చెప్పి, అది ఏ మాధ్యమం అన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో చాలా పాఠశాల్లలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం రెండింటినీ కొనసాగించారు. ఈ నేపథ్యంలో తెలుగులో చదివిన విద్యార్థులు తెలుగులో పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలంటూ ఉపాధ్యాయులు కోరడంతో స్పందించిన ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదికి తెలుగులో పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
Advertisement
AP 10th Students
Public Exams
Andhra Pradesh

More Telugu News