2025లో తండ్రి కాబోతున్న భారత్ క్రికెటర్... గ్రాండ్‌గా ప్రకటన
- తల్లిదండ్రులు కాబోతున్న కేఎల్ రాహుల్, అథియా శెట్టి దంపతులు
- స్పెషల్ పోస్టర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించిన టీమిండియా క్రికెటర్
- 2025లో బేబీ రాబోతోందని వెల్లడి
కాగా తొలిసారి తల్లిదండ్రులు కాబోతున్న రాహుల్, అథియా దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. వచ్చే జనవరిలో ఈ జంట తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. కేఎల్ రాహుల్, అథియా శెట్టి ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దాదాపు నాలుగేళ్ల పాటు డేటింగ్ చేశారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. అథియా శెట్టి ఈ మంగళవారం 32వ పుట్టిన రోజును జరుపుకుంది. ఈ సందర్భంగా కేఎల్ రాహుల్ సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పి ఇద్దరూ కలిసి ఉన్న కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను షేర్ చేశాడు.