Allu Aravind: ఇంత రేటింగ్ ఎవరికీ ఇవ్వరు... బాలయ్య వల్లే సాధ్యమైంది: అల్లు అరవింద్

Allu Aravind hails Nandamuri Balakrishna for the success of Unstoppble with NBK talk show
షార్ట్స్‌లో చూడండి
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించే అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో త్వరలోనే నాలుగో సీజన్ లోకి ఎంటరవుతోంది. విజయదశమి సందర్భంగా హైదరాబాదులో ట్రైలర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. "

రెండున్నర సంవత్సరాల క్రితం ఈ టాక్ షోకి శ్రీకారం చుట్టాం. బాలకృష్ణ గారితో మంచి టాక్ షో చేస్తున్నాం అనే ఊహతో ఈ కార్యక్రమం ప్రారంభించాం. తీరా చూస్తే... ఈ టాక్ షో భారతదేశంలోనే అతి పెద్ద టాక్ షోగా నిలిచింది. 

చాలామందికి తెలిసే ఉంటుంది... ప్రపంచవ్యాప్తంగా ఐఎండీబీ రేటింగ్ ఉంటుంది. ఈ ఐఎండీబీ రేటింగ్ లో అన్ స్టాపబుల్ టాక్ షోకి 9/10 రేటింగ్ ఇచ్చారు. ఇంత రేటింగ్ ఏ షోకి ఇవ్వరు. మన దేశంలో కొన్ని టాప్ షోలు ఉన్నాయి... వాటి పేర్లు చెప్పడం బాగుండదు కానీ... ఐఎండీబీలో వాటి రేటింగ్ చూడండి... అన్నీ 6.5, 6.7... ఇలా ఉంటాయి. మన షోకి మాత్రమే 9/10 ఇచ్చారు. 

అటువంటి టాక్ షో మన ఆహాకి రావడం మా అదృష్టం. ఈ టాక్ షో బాధ్యతలను మేం బాలయ్య భుజాలపై పెట్టాం... ఆయన దాన్ని అంత ఎత్తుకు తీసుకెళ్లారు" అంటూ అల్లు అరవింద్ వివరించారు.
Go Back to Shorts
Allu Aravind
Nandamuri Balakrishna
Unstoppable Talk Show
Aha
Tollywood

More Telugu News