ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ను నియమించిన తెలంగాణ ప్రభుత్వం
- హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్‌ను నియమించిన ప్రభుత్వం
- 60 రోజుల్లో నివేదికను సమర్పించాలని ఆదేశం
- ఎస్సీ వెనుకబాటుతనాన్ని ఉపకులాల వారీగా అధ్యయనం చేయనున్న కమిషన్
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. పలు పర్యాయాలు సమావేశమైన ఈ కమిటీ... ఎస్సీ రిజర్వ్‌డ్ కులాల వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం షమీమ్ అక్తర్‌ను నియమించింది.