Pooja Hegde: బాలీవుడ్ సీరియల్ నటుడి ప్రేమలో పూజా హెగ్డే

Pooja Hegde in love with Bollywood serial actor Rohan Mehra
  • రోహన్ మెహ్రా ప్రేమలో పూజా హెగ్డే
  • పలుమార్లు కెమెరాకు చిక్కిన ప్రేమ జంట
  • అవకాశాలు రాకపోవడంతో రెమ్యునరేషన్ తగ్గించిన పూజ
మొన్నటి దాకా టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందిన కన్నడ భామ పూజా హెగ్డే... ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. తమిళం నుంచి ఆఫర్లు వస్తున్నప్పటికీ... టాలీవుడ్ హీరోలు, దర్శకనిర్మాతలు మాత్రం ఆమె వైపు చూడటం లేదు. మరోవైపు పూజా హెగ్డే గురించి ఒక ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. హిందీ సీరియల్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ రోహన్ మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమలో ఉందనేదే ఆ వార్త. తన ప్రియుడితో కలిసి పూజ తరచుగా బయట తిరుగుతుంటుంది. ఈ ప్రేమ జంట పలుమార్లు కెమెరా కంటికి కూడా చిక్కింది. 

మరోవైపు, టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ల సరసన పూజా హెగ్డే నటించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న పూజ ఒక్కసారిగా స్లో అయిపోయింది. వరుస ఫ్లాప్ సినిమాలతో ఆమె గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది.  దీంతో ఆమెను టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది.

'గుంటూరు కారం' సినిమాలో తొలుత పూజను తీసుకున్నా... ఆ తర్వాత ఆమెను పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ఒక్క ఆఫర్ కూడా ఆమెకు రాలేదు. ఈ క్రమంలో ఆమె తన రెమ్యునరేషన్ ను భారీగా తగ్గించిందట. కోలీవుడ్ స్టార్ విజయ్ సినిమాకు ఆమె రెమ్యునరేషన్ తగ్గించి తీసుకుందట. తమిళంలో సూర్య చిత్రంలో కూడా పూజ ఖరారయింది. ఈ రెండు చిత్రాలు తనకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తాయని ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది.
Pooja Hegde
Love
Boy Friend
Tollywood
Bollywood

More Telugu News