లేడీ ఫ్యాన్‌తో హిట్‌మ్యాన్ నాగిన్ డ్యాన్స్ చూశారా?.. ఇదిగో వీడియో!
- టీమిండియా ప్లేయర్లతో కలిసి కపిల్ కామెడీ షోకు వెళ్లిన రోహిత్
- తనతో కలిసి నాగిన్ డ్యాన్స్ చేయాలని కోరిన లేడీ ఫ్యాన్
- ఆమె కోరిక నెరవేర్చిన హిట్‌మ్యాన్
వివరాల్లోకి వెళితే.. 2024 టీ20 వరల్డ్‌కప్ ఆడిన కొందరు టీమిండియా ప్లేయర్లతో కలిసి ఇటీవల రోహిత్ శర్మ కపిల్ కామెడీ షోకు వెళ్లాడు. ఆ షోలో పాల్గొన్న ఓ లేడీ ఫ్యాన్ తనతో కలిసి డ్యాన్స్ చేయాలని హిట్‌మ్యాన్‌ను అడిగింది. స్టెప్పులు వేయమని రోహిత్ ను కోరింది. మొదట రోహిత్ అందుకు నిరాకరించాడు. తనవల్ల కాదంటూ సున్నితంగా తిరస్కరించాడు.
కానీ, అభిమాని పట్టుబట్టడంతో ఆమె కోరిక మేరకు నాగిన్ డ్యాన్స్ చేశాడు. ఆ సమయంలో ప్రేక్షకుల మధ్య రోహిత్ భార్య రితిక సజ్దేశ్ కూడా ఉన్నారు. ఆమె కూడా రోహిత్ లేడీ ఫ్యాన్‌తో కలిసి నాగిన్ డ్యాన్స్ వేయడం చూసి చిరునవ్వులు చిందించడం వీడియోలో కనిపించింది. అభిమానితో కలిసి హిట్‌మ్యాన్ నాగిన్ డ్యాన్స్ చేసిన క్లిప్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ రోహిత్ నాగిన్ డ్యాన్స్‌పై ఓ లుక్కేయండి.