కాలేజీ క్యాంపస్‌లో శునకంపై దాడిచేసిన మర్కటం.. భీకర పోరు.. వీడియో ఇదిగో!
- విడిపించేందుకు శతవిధాలా ప్రయత్నించిన కాలేజీ కుర్రాళ్లు
- కర్రలతో కొట్టి, కుర్చీలు విసిరినా పట్టువిడవని వైనం
- చివరికి అతికష్టం మీద శునకాన్ని వదిలి పరారైన కోతి
ఈ ఘటన సరిగ్గా ఎక్కడ జరిగిందన్నది మాత్రం తెలియరాలేదు. వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ రెండింటికీ ఏమైనా శత్రుత్వం ఉందేమో అని ఒకరంటే, పోటీ తీవ్రంగా ఉందని ఇంకొకరు కామెంట్ చేశారు. కుక్కకు, కోతికి మధ్య ఉన్నది జాతి శత్రుత్వమని, అందుకే అవి అంతగా తలపడుతున్నాయని మరొకరు వ్యాఖ్యానించారు.